సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి గుండె మార్పిడి ఆపరేషన్ అవసరం ఉన్న వ్యక్తి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మీర్‌పేటకు చెందిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తి గుండెను కేర్ ఆసుపత్రిలో ఉన్న మరో వ్యక్తికి అమర్చేందుకు ఆసుపత్రి సిబ్బంది తీసుకెళ్లారు. గత రెండురోజుల క్రితం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి తీవ్ర గాయాలతో బ్రెయిన్‌డెడ్ అయ్యారు. ఇరు కుటుంబ సభ్యుల వారు అంగీకరించడంతో వారి అవయవాలను అతనికి అమర్చేందుకు సిద్ధమయ్యారు.
గ్రీన్ కారిడార్:
ఇవాళ సికింద్రాబాద్ నుంచి నాంపల్లికి గుండె, ఇతర అవయవాలను తరలించారు. అన్ని రకాల అనుమతులు తీసుకున్న అనంతరం అవయవ మార్పిడి కోసం తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దారిపొడవునా ఎలాంటి ఆటంకం లేకపోవడం వల్ల అంబులెన్స్‌ను వేగంగా నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం