హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలో కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాస్టర్స్ చెఫ్‌ను ఆయన సత్కరించారు.
అకాడమీలో చదువుకున్న దాదాపు ఏడు వేల మందికిపైగా చెఫ్ మాస్టర్‌గా దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.