హైదరాబాద్ నారాయణగూడలో సదర్ వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల్లో దున్నరాజుల విన్యాసాలు ఆకట్టుకోగా... డీజే మోతలు, దుమ్మురేగే డాన్సులతో యువత హోరెత్తించింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిలిపేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ను పశువులు తినడం వల్ల వాటి కడుపుల్లో ప్లాస్టిక్ పేరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఇవీ చూడండి : 'కార్మికుల పట్ల కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు'