ETV Bharat / state

దండిగా ధాన్యం.. ఇక్కట్లు తీరిస్తే ధన్యం

నీరు పారింది... పంట పండింది... తెలంగాణ జలసిరితో మాగాణమైంది... ప్రభుత్వ అంచనాల ప్రకారం రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు రాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో ధాన్యం సేకరణకు గోనె సంచులు, హమాలీల కొరత అవరోధంగా ఉంది. ధాన్యం ఆరబోతకు, వర్షాల వల్ల తడిసిపోకుండా కాపాడుకునేందుకు పరదాలు లేక రైతులు తంటాలు పడుతున్నారు.

Grain purchasing felicities
దండిగా ధాన్యం.. ఇక్కట్లు తీరిస్తే ధన్యం
author img

By

Published : Apr 17, 2020, 7:18 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరమవుతున్నాయి. గత రబీలో 3,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి గ్రామాల్లోనే 6,800 కొనుగోలు కేంద్రాలు నెలకొల్పనున్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ తదితర జిల్లాల్లో ఇప్పటికే సుమారు 3350 కేంద్రాలను ప్రారంభించారు. ఇంతవరకు 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. మొత్తం 1.05 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయానికి వస్తుందని అంచనా.

దీనికి సుమారు 20కోట్ల గోనె సంచులు(గన్నీ బ్యాగులు) కావాలి. వీటికోసం అధికారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సంచులు ఏప్రిల్‌ నెలాఖరు వరకు సరిపోతాయని, తర్వాత చేసే కొనుగోళ్లకు వాటిని సమకూర్చుకోవాల్సి ఉంటుందని అంచనా.

తెలంగాణలోని ధాన్యం మిల్లుల్లో బిహార్‌కు చెందిన హమాలీలు పనిచేస్తున్నారు. హోలీ సమయంలో వారు సొంత రాష్ట్రానికి వెళ్లి, లాక్‌డౌన్‌ వల్ల అక్కడే ఉండిపోయారు. వారిని రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బిహార్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో హమాలీల కొరత ఎదురవుతోంది. ప్రస్తుతానికి ధాన్యాన్ని రైతులు, స్థానికుల సహాయంతో లారీల్లోకి ఎక్కిస్తున్నారు. బిహార్‌ నుంచి హమాలీలు రాకుంటే సమస్యలు ఎదురవుతాయని ఒక అధికారి తెలిపారు.

తరుగు పేరుతో తిరకాసు

కొన్ని కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు తరుగు పేరుతో ఎక్కువ పరిమాణంలో ధాన్యాన్ని తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని నిర్ధరించిన తరువాత మాత్రమే ధాన్యాన్ని కాంటా వేసి, క్వింటాకు 1.5 కిలోలను రైతుల నుంచి మినహాయిస్తారు. ధాన్యం మిల్లులకు చేరిన తరువాత కొందరు మిల్లర్లు అయిదు కిలోల వరకు తరుగు కింద మినహాయించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. సీజన్‌ కావడంతో గ్రామాలవారీగా రైతులు సమావేశమై వరికోత యంత్రాల అద్దెలను పెంచవద్దని తీర్మానాలు చేస్తున్నారు. గంటకు యంత్రానికి రూ.1800 నుంచి 2500 దాకా అద్దె నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,848 యంత్రాలున్నాయని, రైతులు తొందరపడి అధికంగా అద్దె చెల్లించవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ఆరబోత కష్టాలు

తేమను తగ్గించేందుకు రైతులు ధాన్యాన్ని ముందే ఆరబోసి తేవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతులు పొలాల్లో, రోడ్లపై ఎక్కడ వీలైతే అక్కడ ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఏ మాత్రం వాన పడినా తేమ మరింత పెరిగి ధాన్యం పాడవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల వద్ద పరదాలు లేక ఆరబోసిన ధాన్యం తడిసిపోకుండా భద్రపరచలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏపీ నుంచి వచ్చే కూలీలు టార్పాలిన్లు, పరదాలు తెచ్చేవారని, ఇప్పుడు వాటికి కొరత ఏర్పడిందని జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు చెప్పారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.