Ground Water: రాష్ట్రంలో సగానికి పైగా భూభాగంలో భూగర్భ జలాలు ఐదు నుంచి పదిమీటర్ల మధ్య లోతులో ఉన్నాయి. దాదాపు 55 శాతం విస్తీర్ణంలో భూగర్భ జలమట్టం ఐదు నుంచి పదిమీటర్ల మధ్య ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 29 శాతం విస్తీర్ణంలో ఐదు మీటర్ల లోపు భూగర్భ జలాలు ఉండగా... 14 శాతం విస్తీర్ణంలో పది నుంచి 15 మీటర్ల లోపు ఉన్నాయి. రెండు శాతం విస్తీర్ణంలో మాత్రం భూగర్భ జలాలు 15 మీటర్ల కంటె ఎక్కువ లోతులో ఉన్నాయి.
నిరుడు ఫిబ్రవరితో ఈ ఏడాది ఫిబ్రవరిలో భూగర్భ జాలాలు 0.34 మీటర్ల పెరుగుదల ఉంది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 570 మండలాల్లో పెరుగుదల ఉండగా... 24 మండలాల్లో భూగర్భ జలమట్టం తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 7.02 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. కనిష్టంగా వనపర్తి జిల్లా సగటు 3.54 మీటర్లు కాగా... గరిష్టంగా మెదక్ జిల్లా సగటు 11.74 మీటర్లు ఉన్నట్లు రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదిక వెల్లడించింది.
ఇదీ చదవండి: