Family planning surgeries కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కు.ని శస్త్రచికిత్సల క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 25న 34 మంది మహిళలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందటంతో పాటు పలువురు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టుతో పాటు, ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు క్యాంపులను నిలిపివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదికల ఆధారంగా భవిష్యత్తులో క్యాంపుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది.
ఇవీ చదవండి: మామా, అల్లుడు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.. ఇబ్రహీంపట్నం ఘటనపై రేవంత్ ఫైర్