ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. కొవిన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది.
ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తయారీ సంస్థల నుంచే ప్రైవేటు సెంటర్లు టీకాలను సొంతంగా కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'