ETV Bharat / state

యూరియా సమస్యపై సర్కారు ప్రత్యేక దృష్టి - యూరియా కోసం ప్రత్యేక అధికారులు

రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు నలుగురు ప్రత్యేక అధికారులను నియమించారు. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

సీఎం కేసీఆర్​
author img

By

Published : Sep 8, 2019, 7:32 AM IST

యూరియా సమస్యపై సర్కారు ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో యూరియా సమస్యపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు నౌకాశ్రయాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. విశాఖపట్నం నౌకాశ్రయం - మధుమోహన్‌, కాకినాడ - తులసీరాం, కృష్ణపట్నం - శివానంద్, గంగవరం పోర్ట్‌కు తిరుపతినాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. రైళ్ల ద్వారా యూరియా సరఫరా.. తదితర బాధ్యతలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు.

రైతుల ఆందోళనతో చర్యలు

ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​ దృష్ట్యా... నిజామాబాద్​, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్‌, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో యూరియా దొరక్క రైతులు రోడ్లెక్కి ఆందోళనబాట పట్టారు. యూరియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూలో నిలబడిన ఇద్దరు రైతులు మరణించడం వల్ల దుమారం చెలరేగింది. ఈ విషయం సర్కారు తలనొప్పిగా పరిణమించడం వల్ల సీఎం కేసీఆర్​ వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి, మార్క్​ఫెడ్​ ఉన్నతాధికారులతో యూరియా కొరతపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో 3 రోజుల్లోగా యూరియా సమస్యకు ముగింపు పలకాన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి : 'విక్రమ్' కోసం మరో 14 రోజులు అన్వేషణ​ : శివన్

Intro:hyd_tg_15_08_dengi_death_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:వాతావరణ మార్పులతో ఆస్పత్రి చూసిన జ్వర పీడితులు తో నిండిపోతున్నాయి దీనికితోడు డెంగీ జ్వరం ప్రబలడం తో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బృందావన కాలనీ కి చెందిన భాను సురేఖని మహిళ ఈ నెల 3వ తేదీన జ్వరం వచ్చింది అంట నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది అప్పటి నుంచి ఆమె జ్వరం తగ్గక పోగా డెంగీ లక్షణాలతో శనివారం మృతి చెందింది దీనితో ఆమె బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు

Conclusion:దేంగీ జ్వరాల బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.