సాయుధ బలగాలకు మనమంతా చాలా రుణపడి ఉన్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. సాయుధ బలగాల పతాక దినోత్సవం సందర్భంగా తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ బృందంతో ఆమె సమావేశమయ్యారు. దేశం కోసం సాయుధ బలగాలు చేసిన త్యాగాలు మరువలేవనివని పేర్కొన్న గవర్నర్.. వారి కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని వెల్లడించారు.
దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం రాజ్‌భవన్ తరపున స్వయం ఉపాధిపై శిక్షణా కార్యక్రమాలు చేపడతామని గవర్నర్ పేర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా వారు నిలదొక్కుకోవడానికి వీలుంటుందని వివరించారు. ఈ సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కోసం కృషి చేసిన రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు సభ్యులకు మెమొంటోలు అందజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయాన్ని తెలంగాణ సైనిక్ వెల్ఫేర్‌కు అందజేయాలని గవర్నర్ కోరారు.
ఇదీ చదవండి : తెలంగాణ పత్తికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి: కేసీఆర్