మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని గవర్నర్ తమిళిసై వీక్షించారు. చిరంజీవి ఆహ్వానం మేరకు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో కుటుంబసమేతంగా సినిమాను చూశారు. దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే సైరా చిత్రం తనకు బాగా నచ్చిందని తమిళిసై తెలిపారు. చిరంజీవి అద్భుతంగా నటించారని ప్రశంసించారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి వ్యక్తీకరించడానికి నిజంగా మాటలు రావడం లేదన్నారు. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని చూడాలని కోరారు.
ఇదీ చూడండి : "ఆర్టీసీ అప్పులు, ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి"