ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల్లో టీకాపై మరింత అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా వ్యాక్సిన్‌పై గవర్నర్ ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు టీకాలపై సరైన అవగాహన తోడ్పడుతుందని తమిళిసై పేర్కొన్నారు.
ఏమరపాటు వద్దు..
ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్‌పై దృష్టి సారించినప్పటికీ.. చిన్న పిల్లలకు ప్రాణాధారమైన ఇతర టీకాల విషయంలో ఏమరపాటు వద్దని గవర్నర్ సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ చేపట్టిన దృష్ట్యా... అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి అవసరమైన టీకాల్లో ఎక్కువగా ఇక్కడే తయారవటం తెలుగువారికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
-
జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం -2021 సందర్భంగా టీకాల పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇది అందరి ఆరోగ్యానికి తోడ్ప డుతుంది.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రస్తుతం మనం కోవిడ్ వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినప్పటికీ చిన్న పిల్లలకు ప్రాణాధారమై ఇతర టీకాలు ఇప్పించడం మరిచిపోవద్దు.(1/2) pic.twitter.com/Fs4252uABF
">జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం -2021 సందర్భంగా టీకాల పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇది అందరి ఆరోగ్యానికి తోడ్ప డుతుంది.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 16, 2021
ప్రస్తుతం మనం కోవిడ్ వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినప్పటికీ చిన్న పిల్లలకు ప్రాణాధారమై ఇతర టీకాలు ఇప్పించడం మరిచిపోవద్దు.(1/2) pic.twitter.com/Fs4252uABFజాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం -2021 సందర్భంగా టీకాల పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇది అందరి ఆరోగ్యానికి తోడ్ప డుతుంది.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 16, 2021
ప్రస్తుతం మనం కోవిడ్ వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినప్పటికీ చిన్న పిల్లలకు ప్రాణాధారమై ఇతర టీకాలు ఇప్పించడం మరిచిపోవద్దు.(1/2) pic.twitter.com/Fs4252uABF
ఇదీ చదవండి: రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం