కొవిడ్ మహమ్మారి వేధిస్తున్న సమయంలో అతి తక్కువ సమయంలోనే పూర్తి దేశీయ పరిజ్ఞానంతో టీకా అందించిన భారత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా, జీఎండి సూచిత్రా ఎల్లా దేశానికే గర్వకారణం అని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ది జర్నీ టు గుడ్ హెల్త్ ఫార్ ఆల్ పేరుతో ఫిక్కీ ఫ్లో ఏర్పాటు చేసిన సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గతంలో భారత్ బయోటెక్ ప్లాంట్‌ని సందర్శించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. తాము విద్యార్థి దశలో ఉనప్పుడు టీకా కోసం విదేశాల వైపు ఎదురు చూడాల్సి వచ్చేదన్న గవర్నర్ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందాల్సి ఉందని కృష్ణా ఎల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణా ఎల్లా, జీఎండి సూచిత్రా ఎల్లా, ఫిక్కీ ఫ్లో హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ ఉమా చిగురుపాటి సహా ఫిక్కీ ఫ్లో సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
High court: హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు.. ఉత్తర్వులు జారీ