ETV Bharat / state

బి.ఎస్​.బజాజ్​ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై, మంత్రి కేటీఆర్​ సంతాపం - బి.ఎస్​.బజాజ్​ మృతి వార్తలు

డాక్టర్​ బి.ఎస్​.బజాజ్​ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై, మంత్రి కేటీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

governor-tamilsai-mourns-death-of-bs-bajaj
బి.ఎస్​.బజాజ్​ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై, మంత్రి కేటీఆర్​ సంతాపం
author img

By

Published : Jul 28, 2020, 4:43 PM IST

Updated : Jul 28, 2020, 5:38 PM IST

బయోటెక్‌ రంగ ప్రముఖులు డాక్టర్​ బి.ఎస్‌.బజాజ్‌ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ ఆఫ్ ఆసియన్‌ బయోటెక్‌ అసోసియేషన్స్‌ వ్యవస్థాపక కార్యదర్శిగా బజాజ్‌ చేసిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు.

బజాజ్..​ బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని గవర్నర్ కొనియాడారు. జినోమ్ వ్యాలీ, బయో ఆసియా కోసం ఆయన ఎంతగానో ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేటీఆర్​ సైతం..

మరోవైపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సైతం బజాజ్​ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. బయో టెక్నాలజీ రంగ అభివృద్ధికి డాక్టర్​ బి.ఎస్​. బజాజ్​ ఎంతగానో కృషి చేశారన్న మంత్రి.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీచూడండి: ఆదుకోవాల్సిన బ్యాంకులే.. ఆడుకుంటున్నాయి

Last Updated : Jul 28, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.