ETV Bharat / state

ఇస్రోకు గవర్నర్​ తమిళిసై అభినందనలు - పీఎస్ఎల్‌వీ సీ-49 రాకెట్‌ తాజా వార్తలు

పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం విజయవంతంపై ఇస్రోను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందిచారు. తొమ్మిది ఇతర ఉపగ్రహాలతో పాటు దేశీయంగా రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్​ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు.

governor tamilisai wishes to isro
ఇస్రోకు గవర్నర్​ తమిళిసై అభినందనలు
author img

By

Published : Nov 7, 2020, 10:07 PM IST

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్)‌ నుంచి పీఎస్ఎల్‌వీ సీ-49 రాకెట్‌ విజయవంతంపై ఇస్రోకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. తొమ్మిది ఇతర ఉపగ్రహాలతో పాటు ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్​ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు.

ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు మన దేశాన్ని మరోసారి గర్వపడేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి లాంటి కఠిన పరిస్థితుల్లో ఇస్రో కొత్త ఆశలను చూపించిందని.. ఇస్రో శాస్త్రవేత్తలు దేశంలోని కోట్లాది యువతియువకులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.

ఇదీ చదవండి: కేంద్రం నుంచి నయాపైసా కూడా సాయం అందలే: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.