కుటుంబ సంరక్షణ మొదలుకొని దేశ నిర్మాణం వరకు అన్నింట్లో మహిళలు సర్వశక్తిమంతులని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ -19 సమయంలో మహిళలు సంరక్షకులుగా, ఫ్రంట్‌లైన్ యోధులుగా చూపించిన త్యాగం, ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2021 అంతర్జాతీయ థీమ్- మహిళల నాయకత్వమని... అన్ని రంగాల్లో మహిళలు సమానత్వం సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే పెళ్లే వద్దనుకున్నా..