ETV Bharat / state

ముస్లింలకు గవర్నర్​, సీఎం కేసీఆర్​.. బక్రీద్​​ శుభాకాంక్షలు.. - గవర్నర్ తాజా వార్తలు

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్.. ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం.. త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని గవర్నర్, సీఎం ఆకాంక్షించారు.

బక్రీద్​ శుభాకాంక్షలు
బక్రీద్​ శుభాకాంక్షలు
author img

By

Published : Jul 9, 2022, 5:28 PM IST

Updated : Jul 9, 2022, 7:17 PM IST

ముస్లింలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్.. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్​ను భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని కోరారు. ఈ పండుగ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని గవర్నర్​ ఆకాక్షించారు. బక్రీద్ పర్వదినం త్యాగాలకు ప్రతీకని కొనియాడారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసం కలిగి.. సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తుందని సీఎం కేసీఆర్​ తెలిపారు. తమకు ఉన్న దాంట్లో ఇతరులకు పంచిపెట్టడం కంటే మించిన దాతృత్వం లేదనే స్పూర్తిని కలిగిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ తరహాలో బక్రీద్​ను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. ఇస్లాం ధర్మాన్ని ప్రపంచంలో కోట్లాది మంది అవలంభిస్తున్నారని.. శాంతి, సహనం, దయ, కరుణ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వాన్ని బోధిస్తుందని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా పూర్వీకులను కొలుస్తారని చెప్పారు.

సీఎం కేసీఆర్ పాలనలో మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి అభద్రతభావానికి లోనుకాకుండా జీవిస్తున్నారని కొప్పుల పేర్కొన్నారు. రాష్ట్రంలో 204 గురుకుల పాఠశాలల ద్వారా మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పేదింటి ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకం ద్వారా చేయూత అందిస్తున్నామని తెలిపారు. బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: మీ ఏరియాలో కరెంటు సమస్యా..? వైర్లు తెగిపడ్డాయా..? ఈ నెంబర్లకు కాల్​ చేయండి..

'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత

Last Updated : Jul 9, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.