బోయిన్పల్లి మార్కెట్ తరహాలో ఇళ్లు, కార్యాలయాల్లో కూడా బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్భోదించారు. కూరగాయల వ్యర్థాలతో విద్యుత్, బయోగ్యాస్ ఎరువు తయారీ బాగుందని గవర్నర్ కొనియాడారు. మన్‌కీ బాత్‌లో జాతినుద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో బోయిన్పల్లి బయోగ్యాస్ ప్లాంటు గురించి ప్రస్తావించారని... రాష్ట్రానికి గర్వకారణమని తమిళి సై పేర్కొన్నారు.
సికింద్రాబాద్ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును గవర్నర్ ఇవాళ సందర్శించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలికారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో గవర్నర్ కలియతిరిగారు.
కూరగాయల రైతుతో మాట్లాడిన తమిళిసై... ఏ గ్రామం నుంచి వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఐఐసీటీ శాస్త్రవేత్తల బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, ఐఐసీటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మోదీ మెచ్చిన మార్కెట్.. మన్‌కీ బాత్‌లో ప్రశంసలు