Governor Tamilisai Speech at KIMS Hospital Summit : కిమ్స్ ఆసుపత్రి ఈ దేశానికి, రాష్ట్రానికి అందిస్తున్న సేవలు అద్భుతమని.. రోగులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈ మేరకు శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, యూపీఐఏల సంయుక్త సహకారంతో నగరంలోని కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం, ఉస్మానియా మెడికల్ కాలేజీలలో(Osmania Medical College) యూరోగైనకాలజీ రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సా పద్ధతులపై మూడు రోజుల సదస్సు జరిగింది.
Awareness Conference on Urogynaecology : ఈ సదస్సు ముగింపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన యూరోగైనకాలజీ నిపుణులు కూడా పాల్గొని.. ఈ రంగంలో వస్తున్న మార్పులు, చికిత్సా పద్ధతులలో వస్తున్న కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు. ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మృతదేహాల మీద శస్త్రచికిత్సా పద్ధతులపై(Surgical Procedures) శిక్షణ ఇచ్చారు. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు కొన్ని విదేశాల నుంచి కూడా గైనకాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొని.. ఈ రంగంలో చికిత్సా పద్ధతులపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు.
Governor Tamilisai Latest News : ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. గైనకాలజిస్టులకు చిన్నపిల్లల సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదన్నారు. తాను కూడా గైనకాలజిస్ట్ నేనని రాజకీయపరంగా నూతనంగా ఏర్పడిన తెలంగాణ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి ఈ దేశానికి, రాష్ట్రానికి అందిస్తున్న సేవలు అద్భుతమని అని కొనియాడారు. అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్(Breast cancer) అవగాహన మాసం. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి బృందం ఈ అంశంపై గ్రామీణ ప్రాంతాల్లోనూ అవగాహన పెంపొందించేందుకు అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు.
ఇవాళ జరుగుతున్న సమావేశం ముఖ్యంగా.. మహిళల్లో మరింత స్పష్టంగా కనిపించే అరుదైన ప్రత్యేకతను బోధిస్తుంది. నేను తెలంగాణ గవర్నర్‌గా ఛార్జ్ తీసుకున్నప్పుడు.. ప్రతి ఒక్కరూ నన్ను చూసి .. ఇంత చిన్న వయస్సులో ఎలా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాలనాపరంగా నిర్వహిస్తారన్నారు. గైనకాలజిస్టులకు చిన్నపిల్లల సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ఎవరూ చెప్పక్కర్లేదు. నేను కూడా గైనకాలజిస్ట్‌నే. రాజకీయపరంగా నూతనంగా ఏర్పడిన తెలంగాణ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లటంలో నావంతు కృషి చేస్తున్నాను. - తమిళి సై సౌందర్ రాజన్, తెలంగాణ గవర్నర్
పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో అవగాహన స్థాయి మారుతుంది. అందువల్ల గ్రామీణ ప్రజలకు(Rural People) ఈ సమస్యల గురించి అవగాహన పెంచాలి. డాక్టర్ భాస్కరరావు ఒక మొబైల్ యూనిట్‌ను కూడా అందిస్తున్నారు కాబట్టి, గ్రామీణులకు ఈ తరహా సమస్యల గురించి చెప్పాలి. సరికొత్త టెక్నిక్‌లు నేర్చుకుని, ప్రజల జీవన నాణ్యత పెంచడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి అని గవర్నర్ చెప్పారు.
mlc kavitha about Breast cancer: 'అమ్మాయిలకు సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరి'
ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కరరావు, సదస్సు ఛైర్‌పర్సన్లు డాక్టర్ బాలాంబ, డాక్టర్ నీనా దేశాయ్. ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ అనురాధ, అంతర్జాతీయ యూరో గైనకాలజీ నిపుణులు ప్రొఫెసర్ పీటర్ ఎన్. రోసెన్‌బ్లాట్, డాక్టర్ హోలీ ఎలిజబెత్ రిచర్, డాక్టర్ మార్లీన్ కార్టన్, డాక్టర్ మైఖేల్ డి.మొయిన్ పాల్గొన్నారు.
కిమ్స్ సరికొత్త అధ్యాయం.. ప్రపంచంలోనే తొలిసారిగా రోగులకు సేవచేసే రోబోలు