గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశం కోసం సమరయోధులు, సైనికులు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.
అతిచిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం తక్కువ కాలంలోనే ఎక్కువ పురోగతిని సాధించిందని గవర్నర్ అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ మరింత అభివృద్ధి చెందిందని.. ఇలాగే కొనసాగితే త్వరలోనే బంగారు తెలంగాణ సాధించవచ్చని తమిళిసై చెప్పారు.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం