Governor comments on private universities bill : రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. హైదరాబాద్ రాజ్‌భన్‌లో తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు. జాతీయ నూతన విద్యా విధానం, ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లు, పనితీరు, మౌలిక సదుపాయాలు, విద్యార్థినుల రక్షణ, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాజ్‌భవన్‌లో డిజిటల్ లైబ్రరీ గవర్నర్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ డిజిటల్ లైబ్రరీ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, ఆయా వర్సిటీల పరిధిలో కళాశాలల్లో తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, మురుగునీటి వ్యవస్థ మెరుగుపరచడంతోపాటు ప్రధాన మూల స్థంభం ఉన్నత విద్యపై ఉపకులపతులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నట్లు ఉద్యోగాల కోసం చూడకుండా పది మందికి ఉపాధి కల్పించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు.
- పెండింగ్ బిల్లులు... గవర్నర్‌పై ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా
- Governor Tamilisai: 'దేశాధి నేతలనైనా కలవొచ్చు.. కానీ కేసీఆర్‌ను కలవలేం'
Governor comments on Universities Bill : వివాదాలు సృష్టించాలన్నది తన ఉద్దేశం కాదని.. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లులు తిరస్కరించడం, అనుమతించడం చేస్తున్నానని ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతిపై నివేదిక ఇవ్వాలని ఇంచార్జీ వీసీని ఆదేశించానని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంతో పోటీపడేందుకు నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు.
ఉన్నత విద్య అభ్యసించడంలో మానసిక ఒత్తిళ్లు నుంచి బయటపడేసేందుకు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. పోటీ పరీక్షలు వాయిదా పడుతున్న దృష్ట్యా తెలంగాణ యువతకు ఆత్మస్థైర్యం కల్పించాలని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు కిమ్స్ వైద్యులు ఉషాలక్ష్మి, సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ వి.రఘురామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అవిచల్ కపూర్, పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.
"వివాదాలు సృష్టించాలన్నది నా ఉద్దేశం కాదు. బిల్లులు తిరస్కరించడం, అనుమతించడానికి కారణం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని బిల్లులు తిరస్కరించా. వర్శిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. ఉపాధి కల్పించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. ఇటీవలి కాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వర్సిటీల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. యువతకు ఆత్మస్థైర్యం కల్పించి రక్షించుకోవాలి."- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇవీ చదవండి: