ETV Bharat / state

Say no to Drugs run: యువత, చిన్నారులు డ్రగ్స్‌బారిన పడకుండా చూడాలి: గవర్నర్‌ - say no to drugs run news

Say no to Drugs run: యువకులు మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డీ ఎడిక్షన్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని గవర్నర్​ తమిళిసై సూచించారు. యువత, చిన్నారులు డ్రగ్స్​ బారిన పడకుండా చూడాలని పేర్కొన్నారు. హైదరాబాద్​ బేగంపేటలోని రసూల్​పూరలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 'సే నో టు డ్రగ్స్' నినాదంతో చేపట్టిన పరుగును గవర్నర్ తమిళిసై, సినీ నటి మంచు లక్ష్మి​ ప్రారంభించారు.

Say no to Drugs run
సే నో టు డ్రగ్స్​ పరుగు
author img

By

Published : Dec 22, 2021, 12:21 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డీఎడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలి: గవర్నర్‌

Say no to Drugs run: యువకులు మత్తపదార్ధాల బారినపడకుండా ప్రభుత్వాలతో పాటు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. హైదరాబాద్‌ బేగంపేటలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సే నో టు డ్రగ్స్' నినాదంతో చేపట్టిన పరుగును గవర్నర్‌ ప్రారంభించారు.ఆ ర్యాలీ కర్ణాటకలోని గోకర్ణ వరకు సుమారు 660 కిలోమీటర్లు ఆరు రోజుల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో సినీనటి మంచులక్ష్మితో పాటు ప్రభుత్వ సలహాదారు ఎస్‌.కె. జోషి, అదనపు డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలు తగ్గుతాయి

Governor inaugurated Say no to Drugs run: యువకులు మత్తుపదార్ధాలను తప్పడు మార్గంలో వినియోగిస్తున్నారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వాటికి బానిసలు కావడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్ధాలు తాత్కాలికంగా సంతోషం కలిగించవచ్చు.. కానీ శాశ్వతంగా అనారోగ్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్​ వినియోగంతో యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని.. మత్తుపదార్ధాలు వాడొద్దని గవర్నర్​ తమిళిసై విజ్ఞప్తి చేశారు.

డీ ఎడిక్షన్​ సెంటర్లు కావాలి

కొన్ని డ్రగ్స్‌ శరీరానికి ఎలాంటి హానీ చేయకపోవచ్చు. కానీ అవి మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. శాశ్వతంగా ఆరోగ్యానికి చెడు చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డీ ఎడిక్షన్‌ సెంటర్స్‌ ఏర్పాటుచేయాలని సూచిస్తున్నా. అందులో చిన్నపిల్లలు, యువకుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలి. మద్యం సేవించవద్దు అనుకునే వారికి అక్కడ అవగాహన కల్పించాలి. మానసిక ప్రవర్తనకు సంబంధించి అంశాలపైనా అక్కడ చైతన్యం కలిగించాలి. -తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్​

అందరి బాధ్యత

రోజురోజుకు పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న మత్తుపదార్ధాలను చూసి ఆందోళన కలుగుతోందని గవర్నర్​ తమిళిసై అన్నారు. చిన్నారులు, యువకులు మత్తుపదార్ధాలు వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే వాటిబారిన పడిన వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇదీ చదవండి: Harish comments on Piyush Goyal: 'అన్నదాతలకు పీయూష్‌ గోయల్‌ క్షమాపణలు చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.