ETV Bharat / state

new year wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్,​ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు - హైదరాబాద్​ వార్తలు

new year wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​... నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని వారు ఆకాంక్షించారు.

new year wishes
new year wishes
author img

By

Published : Jan 1, 2022, 5:07 AM IST

new year wishes : నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక దురాచారాలు, అనారోగ్య సమస్యలపై స్ఫూర్తిదాయక పోరాటం కొనసాగాలని గవర్నర్​ అన్నారు. ఒమిక్రాన్​ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్​ నియంత్రన చర్యలు పాటించాలని, 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్​ ఇప్పించాలని సూచించారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం అన్నారు. 2022 నూతన సంవత్సరంలో కూడా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలనను కొనసాగిస్తూ .. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి తెలిపారు. 2022 నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: New Year Celebrations Telangana : ఆంక్షల నడమ నవవసంతానికి ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.