governor christmas wishes : క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకొని ఆయన భావజాలాన్ని భావితరాలు ముందుకుతీసుకెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఏసు జీవితం మొత్తం ప్రేమ, క్షమ, నిజం, సోదరభావం, త్యాగం వంటి గొప్ప సద్గుణాలతో నిండినదని గవర్నర్ కొనియాడారు. ఈ క్రిస్మస్ పండుగతో ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం సిద్ధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. పండుగను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని గవర్నర్ సూచించారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
cm kcr christmas wishes : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన అన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం... నేటికీ అందరికీ ఆచరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మూడు లక్షల మందికి క్రిస్మస్ కానుక
minister koppula eswar christmas wishes : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సమాజానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలను స్ఫూర్తిగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... అన్ని కులాలు, మతాలు, విశ్వాసాలకు చెందిన వారిని సమదృష్టితో చూస్తున్నారని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు చెప్పారు. కరోనా మహమ్మారిని భూమ్మీది నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలంటూ ప్రార్థనలు చేయాలని తెలంగాణ క్రైస్తవ సమాజాన్ని కోరారు.
ఇదీ చూడండి: Inter first year results: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఫెయిలైనోళ్లంతా పాస్..