ETV Bharat / state

Governor Tamilisai Bathukamma: 'మంచి జీవితాన్ని కోరే సంబురమే బతుకమ్మ..' - తెలంగాణ వార్తలు

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai participated in bathukamma celebrations), ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) పాల్గొన్నారు. మంచి జీవితాన్ని కోరే సంబురమే బతుకమ్మ(bathukamma festival 2021) అని గవర్నర్ అన్నారు. బతుకమ్మకు ప్రచారం కల్పించిన కవితకు శుభాకాంక్షలు తెలిపారు.

Governor Tamilisai bathukamma, tamilisai about bathukamma
బతుకమ్మ సంబురాల్లో గవర్నర్ తమిళిసై, బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Oct 8, 2021, 1:05 PM IST

Updated : Oct 8, 2021, 5:44 PM IST

తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మలోని ఆరోగ్య సూత్రాలను ప్రజలకు చేరువ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai about bathukamma) సూచించారు. మంచి జీవితాన్ని కోరే సంబురమే బతుకమ్మ అని.. బతుకమ్మ సంబురాల్లో ఆరోగ్యం దాగి ఉందని అన్నారు. తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి గవర్నర్(Governor Tamilisai participated in bathukamma celebrations) పాల్గొన్నారు.

పండుగ శుభాకాంక్షలు
Governor Tamilisai bathukamma, tamilisai about bathukamma
బతుకమ్మ సంబురాల్లో గవర్నర్ తమిళిసై, బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత

అందరికీ సంతోషకర జీవితం దక్కాలని ప్రార్థించానని గవర్నర్ పేర్కొన్నారు. బతుకమ్మకు(bathukamma festival 2021) ప్రచారం కల్పించిన కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను తలపైకి ఎత్తుకున్న గవర్నర్... మహిళలతో కలిసి చప్పట్లతో నీరాజనాలు అందించారు.

భాషను బతికించుకోవాలి..

ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... బతుకమ్మ పాతపాటలను సేకరించి వాటిపై పరిశోధన చేయాలని తెలుగు వర్శిటీకి విన్నవించారు. ఫలితంగా భాషను బతికించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌తో కలిసి బతుకమ్మ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. బతుకమ్మ పాటల్లోని పదాలపై పరిశోధన చేయాలని... మరిచిపోయిన అనేక పదాలు బతుకమ్మ పాటల్లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తెలుగు పదాలపై పరిశోధన చేసి భాషను పరిపుష్టం చేయాలని కోరారు.

బతుకమ్మ సంబురాల్లో గవర్నర్, కవిత

ఇదీ చదవండి: TELANGANA CM KCR: హైదరాబాద్​లో అపారనష్టం జరిగితే కేంద్రం పైసా ఇవ్వలేదు: కేసీఆర్

Last Updated : Oct 8, 2021, 5:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.