ETV Bharat / state

'సూపర్​స్టార్ కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు'

Super Star Krishna Passes Away : సూపర్​స్టార్​ కృష్ణ మరణం పట్ల గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, ముఖ్యమంత్రి కేసీఆర్​ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. 350కి పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.

Super Star Krishna Passes Away
Super Star Krishna Passes Away
author img

By

Published : Nov 15, 2022, 8:11 AM IST

Super Star Krishna Passes Away : ప్రముఖ చలనచిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ సంతాపం ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. సూపర్​స్టార్ కుటుంబసభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సీఎం కేసీఆర్​ సంతాపం..: అభిమానులు సూపర్​స్టార్​గా పిలుచుకునే ఘట్టమనేని కృష్ణ కన్నుమూతపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.

విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకుసామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారని కేసీఆర్ వివరించారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణదేననని పేర్కొన్నారు. సూపర్​స్టార్​ కృష్ణ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్.. ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇవీ చూడండి..

ఆకాశంలోకి ఒక తార.. సూపర్​స్టార్ కృష్ణ ఇక లేరు

సూపర్​స్టార్ కృష్ణకే సొంతమైన ఈ ఘనతలు తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.