ETV Bharat / state

కరోనా కేసులపై గవర్నర్​ ఆందోళన

కరీంనగర్ జిల్లా చేగుర్తిలో 30 మందికిపైగా కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని కోరారు.

governor tamili sai speak about corona cases increasing in telangana
కరోనా కేసుల పెరగుదల పట్ల గవర్నర్​ ఆందోళన
author img

By

Published : Feb 20, 2021, 9:06 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరీంనగర్ జిల్లా చేగుర్తిలో 30 మందికిపైగా కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని కోరారు. ముందుజాగ్రత్తగా భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్ చేసుకోవాలని అన్నారు.

మనదేశంలో కోటి మందికిపైగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇప్పటి వరకు కొవిడ్ వ్యాక్సిన్​ ఇచ్చారని... అయినప్పటికీ కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని గవర్నర్ చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణే ముఖ్యమని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో పుదుచ్చేరిలో ఉన్న తమిళిసై... అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించారు. కరైకలి జిల్లాలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు.

ఇదీ చదవండి: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.