ETV Bharat / state

Governor On Yoga Day: మనిషికి, ప్రకృతికి మధ్య అనుబంధమే యోగా..: గవర్నర్ - యోగ డే

Governor On Yoga Day: మనిషికి , ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధానికి యోగా ఒక నిదర్శనమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Governor On Yoga Day
గవర్నర్ తమిళిసై
author img

By

Published : Jun 20, 2022, 5:07 PM IST

Updated : Jun 20, 2022, 5:29 PM IST

Governor On Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా జూన్ 21న యోగా డేని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. యోగా మనసుని , శరీరాన్ని ఒక్కటి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారని గవర్నర్ తెలిపారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేదుకు యోగా ఉత్తమ మార్గమన్న గవర్నర్.. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధానికి యోగా ఒక నిదర్శనంగా పేర్కొన్నారు.

యోగా డేని అంతర్జాతీయంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్.. భారత సనాతన సంస్కృతిలో యోగా ఒక భాగమన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిచటంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయటం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు వ్యాధి నిరోధకతను పెంచుకోవాల్సి ఉందని అలాంటి ఇమ్యూనిటీని సాధించటం యోగాతో సాధ్యమని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఇంటెలిజెన్స్‌ అధికారుల తనిఖీలు

ఒకే కుటుంబంలో 9 మంది మృతి.. ఆత్మహత్యా? లేక..

Last Updated : Jun 20, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.