దీర్ఘకాలిక ప్రణాళికలతో నీటిని సంరక్షించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. హైదరాబాద్ బేగంపేటలో 'వేస్ట్ మేనేజ్మెంట్ - డబ్ల్యూడబ్ల్యూఎం' ఆధ్వర్యంలో నీరు, వ్యర్థాల నిర్వహణపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును తమిళిసై ప్రారంభించారు. భారత్ సహా వివిద దేశాల నుంచి వంద మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు.
మనదేశంలో నీటిని, నదులను పూజిస్తున్నామని.. దేవతల పేర్లు పెట్టి సహజ వనరులను కాపాడుకుంటున్నామని గవర్నర్ అన్నారు. దేశ అభివృద్ధి నీటితో ముడిపడిన దృష్ట్యా ప్రతి నీటి బొట్టును ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
నీటి, వ్యర్థాల నిర్వహణపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: 'సీఎం కేసీఆర్ పుట్టినరోజును రైతు దినోత్సవంగా నిర్వహిస్తాం'