టీబీ రోగులకు అందుతోన్న వైద్య సేవలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్ష నిర్వహించారు. రాజ్‌భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్, ప్రభుత్వ టీబీ విభాగం, ప్రపంచ ఆరోగ్య శాఖ నిపుణులతో ఆమె చర్చించారు.
వైద్య సిబ్బంది కొవిడ్-19 బాధితుల చికిత్సలో నిమగ్నమైనందున.. టీబీ బాధితుల పట్ల జాగ్రత్తలు వహించాలని డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. టీబీ, కరోనా రోగుల వ్యాధి లక్షణాల్లో సారూప్యత ఉన్నందున వారి చికిత్స పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. టీబీ పేషెంట్లకు సరిపడా మందులున్నాయా లేవా అని ఆరా తీశారు. టీబీ రోగుల కొత్త కేసులు నమోదు చేస్తూ.. వారి సహాయార్థం ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని గవర్నర్ సూచించారు.
ఇవీ చూడండి: ఈనాడు-ఈటీవీభారత్ 'కూలి'పోతున్నారు!' కథనానికి స్పందన