Governor Reacted on MP Kotha Prabhakar Reddy Murder Attempt : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న తమిళిసై.. దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల భద్రతపై దృష్టి సారించాలని పోలీస్ శాఖకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనలో దర్యాప్తు చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే అభ్యర్థుల భద్రతపై పోలీస్ శాఖ దృష్టి సారించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇదిలా ఉండగా.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు.. యశోద ఆస్పత్రికి చేరుకుని ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్న ఆయన.. ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. కత్తి పోటుతో ప్రభాకర్‌రెడ్డికి గాయాలయ్యాయని.. మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని సూచించారు. ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ పోలింగ్ @30 డేస్.. 'అభివృద్ధి' మంత్రంతో బీఆర్ఎస్ .. 'బీసీతంత్రం'తో బీజేపీ .. 'ఆరింటి'పైనే ఆశలతో కాంగ్రెస్MP Election Vindhya
ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించాం. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దు. మా నాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈ హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం. - హరీశ్‌రావు ప్రకటన
దాడులను చూస్తూ ఊరుకోం..: మరోవైపు.. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా సూరంపల్లిలో ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసి.. తమ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాయని ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని.. దాడులను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
Region : ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్.. బీజేపీ-కాంగ్రెస్ 'ఢీ'.. వింధ్యలో విజయం ఎవరిదో?