కొత్త పురపాలక చట్టంపై గవర్నర్ అభ్యంతరాలు చెప్పడం ప్రజాస్వామ్య నైతిక విజయమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కొత్త పురపాలక చట్టం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలు హరించేదిగా ఉందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమతో పాటు అనేక ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పోరాడాయని తెలిపారు. ఆర్డినెన్స్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరిలో భాజపా కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండించారు.
ఇదీ చూడండి: అధికరణ 370 రద్దు: కశ్మీరీల అంగీకారమే కీలకం