ETV Bharat / state

'చిత్రకళా, వస్త్రాలంకరణ ప్రదర్శన ప్రారంభించిన గవర్నర్​' - Governor Tamili sye Soundara rajan Womens Day

హైదరాబాద్​ సాలార్​జంగ్​ మ్యూజియంలో మహిళా కళాకారులు రూపొందించిన చిత్రకళా, వస్త్రాలంకరణ ప్రదర్శనలను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ప్రారంభించారు. రాష్ట్ర ఆర్ట్​ గ్యాలరీ, హైదరాబాద్​ ఆర్ట్​ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Governor
Governor
author img

By

Published : Mar 7, 2020, 7:43 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలార్​జంగ్​ మ్యూజియంలో మహిళా చిత్రకళా, వస్త్రాలంకరణ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆరంభించారు. మినిస్ట్రీ కల్చరల్​ భారత ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు నిర్వహించారు.

మహిళా కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాలను, వస్త్రాలను గవర్నర్ తిలకించారు. వారి కృషిని, ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వయసుతో సంబంధం లేకుండా యువతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తాము రూపొందించిన వాటిని ప్రదర్శించారు. తమ ప్రదర్శనలకు మంచి స్పందన వచ్చిందని... చూసిన వారు మెచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాలార్​జంగ్​ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.

'చిత్రకళా, వస్త్రాలంకరణ ప్రదర్శన ప్రారంభించిన గవర్నర్​'

ఇదీ చూడండి : 'షీటీమ్​-భరోసా విభాగం ముఖ్యమంత్రికి మానస పుత్రిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.