ETV Bharat / state

'48 గంటల్లో తాజా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ నివేదిక ఇవ్వండి'

Governor Asked TSPSC Paper Leakage Report: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ స్పందించారు. తాజా పేపర్‌ లీకేజీ నివేదికను రాజ్​భవన్​కు పంపాలని గవర్నర్‌ ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సీఎస్‌, టీఎస్‌పీఎస్సీ, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

governor
governor
author img

By

Published : Mar 23, 2023, 8:53 PM IST

Updated : Mar 23, 2023, 10:07 PM IST

Governor Asked TSPSC Paper Leakage Report: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై 48 గంటల్లో తాజా నివేదికలు సమర్పించాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్, టీఎస్‌పీఎస్సీ, డీజీపీకి రాజ్‌భవన్‌ కార్యాలయం లేఖలు పంపించింది. సిట్ దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో కూడా.. తెలపాలని లేఖల్లో గవర్నర్ స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న రెగ్యులర్, పొరుగు సేవల సిబ్బంది ఎంత మంది నియామక పరీక్షలు రాశారో కూడా నివేదిక ఇవ్వాలని గవర్నర్ పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సెలవులు పెట్టారా.. పరీక్షల్లో వారి ఫలితాలు ఎలా వచ్చాయో తదితర విషయాలను నివేదికలో వివరించాలని తమిళిసై స్పష్టం చేశారు.

ముగ్గురు నిందితులకు 14రోజుల రిమాండ్‌: ఇదిలా ఉంటే 6వరోజు జరిగిన సిట్‌ విచారణలో కొత్తగా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌ అనే ముగ్గురు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి 14రోజుల రిమాండ్‌ విధిస్తూ.. ఏప్రిల్‌ 6వరకు గడువు ఇచ్చింది. అనంతరం అంతకు ముందు పేపర్‌ లీకేజీలో పట్టుబడిన 9మంది.. ఇప్పుడు దొరికిన ఈ ముగ్గురిని మొత్తం 12 మందిని చంచల్‌ గూడ జైలుకు తరలించారు. ఆ తొమ్మిది మందికి కస్టడీకి ఇచ్చిన 6 రోజుల గడువు నేటితో ముగియడంతో తాజాగా మళ్లీ కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టును సిట్‌ ఆశ్రయించింది.

మొదట నుంచి జరిగిన సిట్‌ విచారణ: ఈకేసులో టీఎస్‌పీఎస్సీకి చెందిన ఉద్యోగులు గ్రూప్‌-1 పరీక్ష ప్రశ్నాపత్రాలను లీకేజీ చేసినట్లు అనుమానించారు. ఆ కోణంలోనే సిట్‌ అధికారులు తమ దర్యాప్తును మొదటి నుంచి ప్రారంభించారు. గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి.. మిగిలిన పరీక్షలను వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని ఉద్యోగులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లే ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారి ద్వారా రేణుక, డాక్యానాయక్‌ దంపతులను అరెస్ట్‌ చేసి విచారణను వేగవంతం చేశారు.

Governor To Submit Latest TSPSC Paper Leakage Report: వారి ఫోన్‌ కాల్స్‌ డేటాను, నిందితులను విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురుని అదుపులోకి తీసుకొని విచారించారు. కాన్ఫిడెన్సియల్‌ అధికారిని శంకరలక్ష్మిని విచారించి.. ఆమె చెప్పిన విధంగా ప్రధాన నిందితులను విచారించారు. అప్పుడే మరికొన్ని విషయాలు బయటకు వచ్చి.. టీఎస్‌పీఎస్సీలో మొత్తం 12 మంది గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో షమీమ్‌కు 127 మార్కులు, రమేశ్‌కు 122 మార్కులు.. మరో మహిళకు 100కుపైగా మార్కులు వచ్చినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 23, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.