కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులపై ప్రభుత్వ దృష్టి - కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వ దృష్టి వార్తలు
సచివాలయ భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సచివాలయ ప్రాంగణంలోకి ఇక నుంచి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డీ బ్లాక్లో కొనసాగుతున్న ఐటీ సర్వర్లతో పాటు అగ్ని మాపక కేంద్రాన్ని కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తరలిస్తున్నారు. ప్రవేశ ద్వారానికి తాళం వేశారు. ప్రస్తుత భవనాలను తొలగించి.. కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులకు త్వరలోనే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులపై ప్రభుత్వ దృష్టి