టీఎస్‌ఆర్టీసీ వినూత్నంగా డబుల్ డెక్కర్ బస్సుల (Double Decker Buses in Telangana)ను మళ్లీ ప్రవేశ పెట్టాలని ప్రయాణికుడొకరు పురపాలక, ఐటీ శాఖ మంత్రికి ట్వీట్ చేయడం.. దాన్ని రవాణా శాఖ మంత్రికి పంపడం.. ఆ వెంటనే చర్యలు చేపట్టడం వేగంగా సాగిపోయింది. మంత్రి నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారుల వరకూ కసరత్తు చేశారు. టెండర్లు పిలిచారు. 7 నెలలైనా చడీచప్పుడు లేకుండా పోయింది.
ఎందుకీ జాగు..
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కరోనా మహమ్మారి కుదిపేసింది. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులు (Double Decker Buses in Telangana) ఆర్టీసీకి గుదిబండ కాబోతున్నాయా అనే విషయమై కొంత మంది ఉన్నతాధికారులు చర్చించారు. ఆ బస్సులు (Double Decker Buses in Telangana) నిండుతాయా.. నిండినా ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదనేది కొంతమంది అధికారుల వాదన. ఇవి (Double Decker Buses in Telangana) ఆర్టీసీకి తప్పకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనేది మరికొందరి ఆలోచన.
టెండరు దశలోనే బ్రేకు..
ఈ ఏడాది ఆరంభంలో 25 డబుల్ డెక్కర్ బస్సుల (Double Decker Buses in Telangana)కు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. మూడు సంస్థలు ముందుకురాగా ఒక సంస్థ నిలబడింది. నిబంధన ప్రకారం ఒకే సంస్థ నిలబడితే టెండర్లు రద్దవుతాయి. కాని ఆ సంస్థకున్న అనుభవం దృష్ట్యా ముందడుగు వేశారు. ఒక్కో బస్సు (Double Decker Buses in Telangana) తయారీకి రూ.75 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పడంతో పునరాలోచనలో పడ్డారని సమాచారం.
ఇదీ చూడండి: త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు...