ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా తెరాస ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని... ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడం వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కానుందని అన్నారు. ఇన్నాళ్లు జోనల్ వ్యవస్థకు సంబంధించిన దస్త్రం రాష్ట్రపతి వద్ద ఉండడం వల్లనే ఉద్యోగాల భర్తీ ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పప్షం చేశారు. ఈ విషయంలో వైఎస్ షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెరాస కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: కరోనాకు మనోబలమే దివ్యఔషధం