ETV Bharat / state

బ్లాక్‌ఫంగస్‌ కేసుల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం - telangana varthalu

రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు చికిత్స అందించేందుకు కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్‌ సమయంలోనే బ్లాక్‌ ఫంగస్‌ సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందించనున్నారు. కరోనా రోగుల్లో బ్లాక్‌ఫంగస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

black fungus cases
బ్లాక్‌ఫంగస్‌ కేసుల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం
author img

By

Published : May 16, 2021, 3:20 AM IST

మ్యుకోర్‌మైసోసిన్‌నే... సాధారణ పరిభాషలో బ్లాక్‌ఫంగస్‌ అంటారు. ఇదొక ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. కరోనా బాధితుల్లో మ్యుకోర్‌మైసోసిన్‌ సోకుతున్నవారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ వాడటం సహా మధుమేహం ఉన్నవారిలో ఇది ఎక్కువగా వస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పలువురు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. గాంధీ ఆస్పత్రిలోఇప్పటికే కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ మ్యుకోర్‌మైసోసిన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్‌ఫంగస్‌ సోకినవారికి చికిత్స అందించేందుకు... హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఇకపై ఇక్కడ పూర్తిస్థాయిలో బ్లాక్‌ఫంగస్ బాధితులకు చికిత్స అందించనున్నారు. ఈ వ్యాధి బారిన పడ్డ బాధితుల్లో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటివారికి సరోజినిదేవి కంటి ఆసుపత్రి వైద్యుల సాయం తీసుకుని చికిత్స అందించాలని ప్రభుత్వం తెలిపింది. కరోనా సమయంలోనే బ్లాక్‌ఫంగస్‌ సోకితే... గాంధీ ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సూచించింది. కళ్లు లేదా చెంపల్లో వాపు, ముక్కులో అడ్డంకి, నల్లటి పొక్కుల్లాంటివి కనిపిస్తే వెంటనే బయాప్సీకి పంపించి యాంటీ ఫంగల్‌ థెరపీ ప్రారంభించాలని వైద్యులను కోరింది.

మార్గదర్శకాలు జారీ

కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందుకోసం ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకిన వారిలో చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ థెరపీలో సరైన నీటిని వాడకపోవడం వల్ల బ్లాక్‌ఫంగస్‌ వచ్చే ముప్పు ఉందని... అందుకే కేవలం స్టెరైల్ నీటిని మాత్రమే వాడాలని స్పష్టంచేసింది. హ్యూమిడిఫైర్‌ను కనీసం వారానికి ఒకసారైనా యాంటీసెప్టిక్ ద్రావణంలో 30నిమిషాలు ఉంచాలని సూచించింది. ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని బ్లాక్‌ఫంగస్‌ ముప్పును నివారించాలని... ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులను సర్కారు కోరింది.

ఔషధాలు సమకూర్చుకోవాలి..

బ్లాక్‌ఫంగస్‌ను నియంత్రించే మందులకు దేశవ్యాప్తంగా కొరత నెలకొందన్న ప్రభుత్వం... అవసరమైన ఔషధాలను వెంటనే సమకూర్చుకోవాలని టీఎస్‌ఎంఐడీసీకి ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.