ETV Bharat / state

యాసంగి బియ్యంలో 31 శాతం నూకలే..! - fci latest news

ఈ సీజన్​లో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని, సాధారణ బియ్యం తీసుకుంటామని సీజన్​కు ముందే కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యాసంగి ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మార్చి కేంద్రానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రయోగాత్మక(టెస్ట్‌) మిల్లింగ్‌ నిర్వహించే బాధ్యతను మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యాసంగి ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే 31 శాతం నూకలు వచ్చినట్లు నిర్ధారణ కాగా.. నూకల నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

కేంద్రానికి సాధారణ బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వ యత్నం.. కానీ అదే సమస్య..!

author img

By

Published : Jul 8, 2022, 7:39 AM IST

యాసంగి ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే 31 శాతం నూకలు వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీని కోసం ప్రయోగాత్మక(టెస్ట్‌) మిల్లింగ్‌ నిర్వహించే బాధ్యతను మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థ శాస్త్రవేత్తలు రాష్ట్రానికి వచ్చి ధాన్యం నమూనాలను సేకరించి అక్కడి ల్యాబ్‌లో మిల్లింగ్‌ చేశారు. రెండో దఫా 11 జిల్లాల్లో ఎంపిక చేసిన మిల్లుల్లో మిల్లింగ్‌ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా నూకలు వచ్చినట్లు సమాచారం. రెండింటినీ బేరీజు వేసిన తరవాత నూకల శాతంపై ప్రాథమిక అంచనాకు వచ్చింది. నాలుగైదు రోజుల్లో అధికారికంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు అధికారుల సమాచారం.

ధాన్యాన్ని సాధారణంగా ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇవ్వటం ఆనవాయితీ. ఈ సీజన్​లో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని, సాధారణ బియ్యం తీసుకుంటామని సీజనుకు ముందస్తుగానే కేంద్రం స్పష్టం చేసింది. యాసంగిలో క్వింటా ధాన్యం మిల్లింగ్‌ చేస్తే 67 శాతం ఉప్పుడు బియ్యం వస్తాయి. సాధారణ బియ్యంగా మారిస్తే నూకలు ఎక్కువ వస్తాయి. నూకల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు వస్తేనే మిల్లింగ్‌ చేస్తామని మిల్లర్లు స్పష్టం చేశారు.

25 శాతం నూకలకే ఎఫ్‌సీఐ అనుమతి..

కేంద్రం కోటా కింద ఎఫ్‌సీఐ తీసుకునే సాధారణ బియ్యంలో 25 శాతం వరకు నూకలను అనుమతిస్తుంది. అంతకుమించి ఉంటే ఆ బియ్యాన్ని తిరస్కరిస్తుంది. ఈ సీజనులో సాధారణ బియ్యంగా మారిస్తే క్వింటాకు 31 శాతం నూకలు, 36 శాతం బియ్యం వస్తాయని టెస్ట్‌ మిల్లింగ్‌లో నిర్ధారణ అయినట్లు సమాచారం. ఎఫ్‌సీఐ అనుమతికి మించి వచ్చే ఐదు శాతం నూకలను వేరు చేసి వాటి స్థానంలో బియ్యాన్ని కలిపి ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. నూకల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సి ఉంటుంది. నష్టాన్ని ఖరారు చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి రాష్ట్ర మంత్రివర్గం గతంలో అప్పగించింది.

ప్రయోగాత్మక మిల్లింగ్‌ వ్యవహారం ఒకపక్క సాగుతుండగా వివిధ కారణాలతో ఎఫ్‌సీఐ గడిచిన నెల ఏడో తేదీ నుంచి బియ్యం సేకరణను నిలిపివేసింది. బియ్యం తీసుకుంటుందా? లేదా? తీసుకోని పక్షంలో ఆ ధాన్యాన్ని ఏమి చేయాలన్నది ప్రభుత్వానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 50.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసింది. ధాన్యం విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం.

ఇవీ చూడండి..

అంచనా ధరలకు ఆధారమేదీ?.. 'మన ఊరు- మన బడి' టెండర్లు లోపాలమయం

పోలీస్‌ అభ్యర్థులకు అలెర్ట్.. నెగెటివ్​ మార్కులు ఉన్నాయి జాగ్రత్త..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.