ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాలు మద్దతివ్వాలి: ఎంపీ అర్వింద్​ - ఎంపీ అర్వింద్

ముఖ్యమంత్రి పిచ్చి పాలనకు యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎంపీ అర్వింద్​
author img

By

Published : Oct 13, 2019, 8:37 PM IST

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎంపీ అర్వింద్​

కేసీఆర్​ మొండి వైఖరితో 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో హైదరాబాద్​ లిబర్టీలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పిచ్చి పాలనకు యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. సమ్మెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించకుండా చేసిన ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్​, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.