ETV Bharat / state

ఎంతకాలం వెనకేసుకురావాలి?

ఆర్టీసీని ఇంకా ఎంత కాలం, ఎన్నిసార్లు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి 47 కోట్ల రూపాయలు చెల్లించినా సమస్యలు తీరవని తేల్చింది. అత్యవసరంగా 2,209 కోట్ల బకాయిలు, రుణాలు చెల్లించాల్సి ఉందని వివరించింది. కార్మిక సంఘాలు.. విలీనంపై మొండి పట్టుతో ఉంటే చర్చలు సాధ్యం కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టులో విచారణ జరుగుతున్నందున కార్మిక చట్టం కింద ముందుకు వెళ్లడం లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నేడు హైకోర్టుకు వివిధ అంశాలను నివేదించనుంది.

ఎంతకాలం వెనకేసుకురావాలి?
author img

By

Published : Nov 11, 2019, 5:08 AM IST

Updated : Nov 11, 2019, 7:25 AM IST

ఎంతకాలం వెనకేసుకురావాలి?

నాలుగు డిమాండ్ల పరిష్కారానికి 47 కోట్లు చెల్లించాలన్న ఉన్నత న్యాయస్థానం సూచనను పరిశీలించిన ప్రభుత్వం.. 2,209 కోట్ల రూపాయలు తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలుండగా... 47 కోట్లు ఏ రకంగానూ సరిపోవని వెల్లడించింది. గతంలో ఆర్టీసీ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, ప్రస్తుతం బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎక్కువ కేటాయింపులు చేయలేకపోతున్నట్టు తెలిపింది.

పట్టుబడితే కష్టం

చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగిన కార్మిక సంఘాలు.. విలీనంపై పట్టుబడుతున్నాయని, అది సాధ్యం కాని డిమాండ్‌ అని తెలిపింది. ఈ నేపథ్యంలో చర్చలు జరిపినా ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్‌ విచారణలో ఉన్నందున పారిశ్రామిక వివాదాల చట్టం కింద ముందుకు వెళ్లలేకపోతున్నట్టు చెప్పింది.

బాధ్యతారాహిత్యం

వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి నేడు హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించనున్నారు. కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్‌లను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్టు సీఎస్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కార్మిక సంఘాల బాధ్యతారాహిత్యం ఉందని ఆయన వివరించారు.

అవే ఇబ్బందులు

  • ప్రస్తుతం 2,609 బస్సులను మార్చాల్సి ఉందని, ఇందుకోసం 750 కోట్లు అవసరమన్నారు. మార్చి 2020 నాటికి మరో 476 బస్సులను మార్చాలని పేర్కొన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేయకపోతే కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అత్యవసరంగా చెల్లించాల్సిన వాటితో పాటు రుణాలు కూడా ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు.

ఈ నెల 8 నాటికి చెల్లించాల్సిన మొత్తాలు రూ. కోట్లలో :

ఉద్యోగుల ఈపీఎఫ్‌ 788.30
రుణ సహకార సంఘం 500.95
లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ 180.00
పదవీ విరమణ చేసిన వారికి 52.00
ఎండీ ట్యాక్స్‌ 452.36
రీజియన్‌లలో ఆయిల్‌ బిల్లులు 34.40
హెచ్‌ఓ, రీజియన్‌, జోన్‌ చెల్లింపులు 36.40
ప్రైవేట్‌ బస్సుల అద్దెలు 25.00
బస్సు బాడీ తయారీదారులకు 0.60
చేసిస్‌ సరఫరాదారులు 74.60
అక్టోబరు,నవంబరు రుణ చెల్లింపులు 65.00
మొత్తం చెల్లింపులు 2209.0

ఎలా చెల్లించాలి?

  • కేవలం ఉద్యోగులకు రూ.1,521 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎస్​ తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి సంస్థ నష్టాలు రూ.5,269.25 కోట్లు ఉందని, ఈ రకంగా ఆర్టీసీని నష్టాలతో నడిపితే రూ.1,786.81 కోట్ల రుణాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. యూనియన్లతో సమావేశమైనప్పుడు ఆర్థిక పరిస్థితి వివరించి సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. అయినా పట్టించుకోకుండా సంఘాలు సమ్మెకు దిగాయన్నారు.

అయోధ్య తీర్పునాడే...

ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం కొనసాగుతుందని అఫిడవిట్​లో పేర్కొన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశమంతా అప్రమత్తంగా ఉండగా... అదే రోజున ఆర్టీసీ కార్మిక సంఘాలు ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం నిర్వహించాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌ వంటి సున్నితమైన ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికార యంత్రాంగం శ్రమిస్తుంటే... సంఘాలు మాత్రం ఈ కార్యక్రమం చేపట్టాయని తెలిపారు.

ఇబ్బంది కలగనియ్యం

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్‌ సిబ్బందితో ప్రస్తుతం బస్సులు నడిపిస్తున్నట్లు ఇవాళ హైకోర్టుకు అందజేసే నివేదికలో సీఎస్​ పేర్కొన్నారు.

TG_HYD_06_11_GOVT_ON_RTC_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )ఆర్టీసీని ఎంత కాలం ఎన్నిసార్లు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కార్మికుల సమస్యల పరిష్కారానికి 47 కోట్ల రూపాయలు చెల్లించినా సమస్యలు తీరిపోవంది. అత్యవసరంగా 2209 కోట్లు బకాయిలు, రుణాలు చెల్లించాల్సి ఉందని వివరించింది. కార్మిక సంఘాలు విలీనంపై మొండి పట్టుతో ఉంటే చర్చలు సాధ్యం కావని ప్రభుత్వం తెలిపింది. కోర్టులో విచారణ జరుగుతున్న దృష్ట్యా కార్మిక చట్టం కింద ముందుకు వెళ్లడం లేదని, పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నేడు హైకోర్టుకు వివిధ అంశాలను నివేదించనుంది.....LOOOK V.O:ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి 47 కోట్ల రూపాయలు చెల్లించినా... సమస్యలు పరిష్కారం కావని సర్కారు వెల్లడించింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి 47 కోట్లు చెల్లించాలన్న ఉన్నత న్యాయస్థానం సూచనను పరిశీలించి, అధ్యయనం చేయగా... 2209 కోట్ల రూపాయలు తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలుండగా... 47 కోట్లు ఏరకంగానూ సరిపోవంది. గతంలో ఆర్టీసీ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, ప్రస్తుతం బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో ఎక్కువ కేటాయింపులు చేయలేకపోతున్నట్టు తెలిపింది. ఎంతకాలం ఆర్టీసీని రక్షించాలని పేర్కొంది. చట్టవిరుద్దంగా సమ్మెకు దిగిన కార్మిక సంఘాలు విలీనంపై పట్టుబడుతున్నాయని, అది సాధ్యం కాదని డిమాండ్‌ అని... ఈ నేపథ్యంలో చర్చలు జరిపినా ఉపయోగం ఉండదని తెలిపింది. ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్‌ విచారణలో ఉన్నందున పారిశ్రామిక వివాదాల చట్టం కింద ముందుకు వెళ్లలేకపోతున్నట్టు చెప్పింది. వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి నేడు హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకు కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్‌లను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్టు సీఎస్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కార్మిక సంఘాల బాధ్యతరాహిత్యం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం 2609 బస్సులను మార్చాల్సి ఉందని, ఇందుకోసం 750 కోట్లు అవసరమన్నారు. మార్చి 2020 నాటికి మరో 476 బస్సులను మార్చాల్సి ఉందన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేయకపోతే కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. అత్యవసరంగా చెల్లించాల్సిన వాటితో పాటు రుణాలు కూడా ఆర్టీసీని ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. GFX START....... ఈ నెల 8 నాటికి చెల్లించాల్సిన మొత్తాలు కోట్లలో ఉద్యోగుల ఈపీఎఫ్‌ 788.30 రుణ సహకార సంఘం 500.95 లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ 180.00 పదవీ విరమణ చేసిన వారికి 52.00 ఎండీ ట్యాక్స్‌ 452.36 రిజియన్‌లలో ఆయిల్‌ బిల్లులు 34.40 హెచ్‌ఓ, రిజియన్‌, జోన్‌ చెల్లింపులు 36.40 ప్రైవేట్‌ బస్సుల అద్దెలు 25.00 బస్సు బాడీ తయారీదారులకు 0.60 చేసిస్‌ సరఫరాదారులు 74.60 అక్టోబరు,నవంబరు రుణ చెల్లింపులు 65.00 మొత్తం చెల్లింపులు 2209.00 GFX OUT...... V.O:కేవలం ఉద్యోగులకు 1521 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవి కాకుండా ఈ సంవత్సరం ఆగస్టు నాటికి సంస్థ నష్టాలు 5269.25 కోట్లు ఉందన్నారు. ఈ రకంగా ఆర్టీసీని నష్టాలతో నడిపితే 1786.81 కోట్ల రుణాలను ఎలా చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ యూనియన్లతో సమావేశమైనప్పుడు ఆర్ధిక పరిస్థితిని వివరించి సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేసిందన్నారు. అయినా పట్టించుకోకుండా సంఘాలు సమ్మెకు దిగాయని తెలిపారు. సంఘాల ఎన్నిక సమయంలో ఇటువంటి ఎత్తులు వేస్తుంటాయని, సమ్మెలో చిత్తశుద్ధి లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశమంతా అప్రమత్తంగా ఉండగా... అదే రోజున ఆర్టీసీ కార్మిక సంఘాలు చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం నిర్వహించాయన్నారు. హైదరాబాద్‌ వంటి సున్నితమైన ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికార యంత్రాంగం శ్రమిస్తుంటే... సంఘాలు మాత్రం ఈ కార్యక్రమం చేపట్టాయన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్‌ సిబ్బందితో ప్రస్తుతం బస్సులు నడిపిస్తున్నట్టు తెలిపారు. E.V.O:ఆయా అంశాలను సీఎస్‌ ఇవాళ హైకోర్టుకు నివేదించనున్నారు.
Last Updated : Nov 11, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.