భాగ్యనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరమని... మొదటగా రూ.10వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
నగరంలో బస్తీ దవాఖాలను 350కి పెంచబోతున్నామని... ఇప్పటి వరకు 25వేల రెండు పడకల ఇళ్లు సిద్ధమయ్యాయని... మరో 40వేల ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని మేయర్ వెల్లడించారు. అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బల్దియాలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అపోలో ఆస్పత్రిలో చేరిన దత్తాత్రేయ