తెలంగాణ రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికెట్ డిప్లోమా కోర్సులకు గాను నోటిఫికేషన్ విడుదలయింది. వీణ, హిందూస్థానీ వోకల్, కర్ణాటిక్ వోకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, కథక్, సితార, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ప్లూట్ వంటి కోర్సులు అందించనున్నట్లు సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
శాస్త్రీయ సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉండి 10 సంవత్సరాలు నిండినవారు ఆడ్మిషన్లు పొందవచ్చు అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఆయా కళాశాల ప్రిన్సిపాల్ సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం కొవిడ్ -19 వ్యాప్తి దృష్ట్యా ఈకోర్సులన్నింటిని ఆన్‌లైన్ తరగతుల ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రవేశాల కోసం అసక్తి గల అభ్యర్థులు ఆయా కళాశాల సంబంధిత కళాశాల వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారంను పొందవచ్చునని. పూర్తి చేసిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.
1. హైదరాబాద్ రామకోఠిలోని శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
వైబ్‌సైట్ www.stgcmd.com
కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ 90005444874,
ఆఫీస్ ఫోన్ నెంబర్ 040-24758090.
2. శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సికింద్రాబాద్,
ప్రిన్సిపల్ కె. వరలక్ష్మమ్మ, ఫోన్. 9849166973
ఆఫీస్ నెంబర్ 0404-27801788
వైబ్‌సైట్ www.sbrgcmd.com
3. అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గుడిమాల్కాపూర్, ఓల్డ్‌సిటీ హైదరాబాద్
ప్రిన్సిపల్ ఎస్. రమణమూర్తి, ఫోన్ నెంబంర్: 9703240329
ఆఫీస్ ఫోన్-040- 23523850
వైబ్‌సైట్ www.sancgcmd.com
4. విద్యారణ్య ప్రభుత్వ సంగీత కళాశాల; వరంగల్.
ప్రిన్సిపల్ పద్మజా ఫోన్ 9849796546
ఆఫీస్ నెంబర్ 0870- 4226228
వైబ్‌సైట్ www.srividyaranya.com
5. శ్రీజ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నిజామాబాద్
ప్రిన్సిపల్ సరిత...ఫోన్ 9704687023
వైబ్‌సైట్ www.sgsgsmdnzb.org
6. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల... మంథని, కరీంనగర్
ప్రిన్సిపల్ పాండురంగారావు ముతాలిక్, ఫోన్ 8008006767
ఆఫీస్ నెంబర్ 08729-279090
ఇదీ చూడండి: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్