ETV Bharat / state

'ప్రభుత్వ నిర్వాకం వల్లే అన్నదాతల బలవన్మరణాలు' - ఎంపీ రేవంత్ రెడ్డి

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఇద్దరు అన్నదాతలను పొట్టనబెట్టుకుందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

'ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆ ఇద్దరి అన్నదాతల బలవన్మరణాలు'

author img

By

Published : Jun 21, 2020, 10:49 PM IST

ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల‌ే వారం రోజుల వ్యవధిలో ఇద్ద‌రు నిరుపేద రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా.. పేద రైతులకు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఎంపీ రేవంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు కోదండరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పక్షాన పదే పదే ఈ విషయాలను చెప్పినా.. పాలకులు పట్టించుకోవట్లేదని ధ్వజ‌మెత్తారు.

వారే అవినీతికి పాల్పడుతున్నారు..

రెవెన్యూ ప్రక్షాళన అదునుగా తీసుకుంటూ ఆ శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నార‌న్నారు. చేవెళ్ల నియోజకవర్గం పామేల్ గ్రామంలోని ఎస్సీ రైతు అంతయ్య ఈ నెల‌ 17న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో రైతు పెద్దపల్లి జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి రెవెన్యూ అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడ‌ని నేతలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

బలవన్మరణాలకు ప్రభుత్వమే కారణం..

అన్నదాతల బలవన్మరణాలకు ప్రభుత్వమే కారణమ‌ని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. సమగ్ర విచారణ జరిపించాలని.. రైతు కుటుంబాలను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. రెవెన్యూ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల‌ని కోరారు. అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : 'కమల దళపతికి కరోనా లెక్కలు తెలియకపోవడం హాస్యాస్పదం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.