రాష్ట్రంలో ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్కు తరలకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమార్కుల ఆటకట్టించి... ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రెవెన్యూ, వాణిజ్య పన్నులు, డ్రగ్స్, రవాణా, పోలీసు, ఆబ్కారీ శాఖలను భాగస్వామ్యం చేస్తూ... ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.
రెవెన్యూ శాఖ ప్రాణవాయువు నిల్వ, సరఫరాల వివరాలు సేకరిస్తుంది. డ్రగ్స్ విభాగానికి చెందిన వారు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాతో పాటు వాడకం వివరాలు తెలుసుకుంటారు. గొడవల నియంత్రణకు పోలీస్ శాఖ, బయటి నుంచి వచ్చే ఆక్సిజన్ క్రమ పద్ధతిలో సరఫరా జరిగేలా ఆబ్కారీ శాఖ పర్యవేక్షించనుంది. ఇలా ఆయా శాఖలకు చెందిన అధికార బృందాలు ఆక్సిజన్ సరఫరా, వాడకంపై నిఘా ఏర్పాటు చేసింది. వీటితో అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: కొవిడ్ ప్రభావం- ఆహార వ్యవస్థలు అతలాకుతలం