ETV Bharat / state

పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం - పలు సామాజిక వర్గాలను ఎస్టీలో చేర్చిన ప్రభుత్వం

Telangana Budget Sessions 2023-24: రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు.. మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారీలను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం చేశారు.

Telangana budget sessions
Telangana budget sessions
author img

By

Published : Feb 10, 2023, 3:51 PM IST

Telangana Budget Sessions 2023-24: రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారీలను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, సంఘాల నేతలు సీఎం కేసీఆర్​ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​లు​ వెల్లడించారు. వాల్మీకి బోయలను కొన్ని రాష్ట్రాలు ఎస్సీలుగా, ఎస్టీలుగా చేర్చారని గుర్తు చేశారు. 1956 నుంచి తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు పోరాటం చేస్తున్నారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వారిని ఎస్టీలో చేర్చాలని ఉద్యమాలు కూడా జరిగాయని పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు. ఈ జాతి గురించి సమగ్రంగా ఆలోచించిన సీఎం కేసీఆర్ ఎస్టీలోకి చేర్చుతూ.. అసెంబ్లీలో ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం చేశారని వివరించారు. మహబూబ్​నగర్ జిల్లాలో ఎక్కువగా ఈ సమస్య ఉందని.. కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఇదే విషయంపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని వారు వెల్లడించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు వీరయ్య, సుదర్శన్‌రెడ్డిలు కూడా పోడు భూములపై గతంలో ఇచ్చిన హక్కు పత్రాలను సమీక్షించాలని కోరారు. ఆ హక్కు పత్రాలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.

ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ: వీరి ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. పోడుభూములు అనేవి హక్కు కాదు.. దురాక్రమణ అని కేసీఆర్ పేర్కొన్నారు. విచక్షణారహితంగా అడవులు నరికివేయడం సరికాదని చెప్పారు. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇకనుంచి పోడు భూములు రక్షిస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోమని కేసీఆర్ హెచ్చరించారు.

ఇవీ చదవండి: ఈ నెలాఖరులో పోడుభూముల పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటన

ఏడాదిలో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్​దే: హరీశ్​రావు

రాజస్థాన్​ అసెంబ్లీలో హైడ్రామా... పాత బడ్జెట్​ను చదివిన సీఎం అశోక్​ గహ్లోత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.