Teaching staff Age Limit: విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో పనిచేస్తున్న బోధన సిబ్బందికి నిరాశ ఎదురైంది. యూనివర్సిటీ బోధన సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 65కి పెంచాలన్న వినతిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ నిబంధనల్లో ఉద్యోగ విరమణ పెంపు లేదన్న అంశంతో పాటు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని... బోధన సిబ్బంది విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో బోధన సిబ్బంది ఉద్యోగ విరమణ 60 ఏళ్లుగానే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: