ETV Bharat / state

అసంఘటిత కార్మికుల సంక్షేమం ప్రభుత్వం మరిచిపోయింది - GOVERNMENT HAS FORGOTTEN THE WELFARE OF UNORGANISED SECTOR

హైదరాబాద్ గాంధీ భవన్​లో అసంఘటిత కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించారు.  అసంఘటిత రంగంలోని కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.

అసంఘటిత కార్మికులను సాంఘీక భద్రత కిందకు తీసుకురావాలి : హుర్మత్‌

author img

By

Published : Nov 26, 2019, 9:44 AM IST

రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ అసంఘటిత కార్మికుల సమావేశానికి ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు విద్య హుర్మత్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిలు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌, మోంజా మార్కెట్‌ లాంటి అనేక ప్రాంతాల్లో అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోదండ రెడ్డి తెలిపారు. వీరికి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐలు వర్తింప చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులను సాంఘిక భద్రత కోడ్‌ కిందకు తీసుకురావడం కేంద్రం మరచిపోయిందని కార్మిక సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు హుర్మత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : సమ్మెకు ముగింపు పలికాం.. విధుల్లో చేర్చుకోండి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.