రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి చెందిన మొదటి, రెండో దశల నిర్వహణకు 15.90 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చింది. 2020 -23 కాలానికి ఈ నిర్వహణా వ్యయాన్ని మంజూరు చేసింది. అటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి దశకు సంబంధించి ఐదు పంపుల నిర్వహణకు 13.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
ఇక్కడ కూడా మూడేళ్ల కాలానికి అనుమతి ఇచ్చింది. ఎస్సారెస్పీ మొదటి దశలోని వేంపల్లి, నవాబ్, బోడేపల్లి పంప్ హౌస్ల రెండేళ్ల నిర్వహణకు 4.27 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ