ETV Bharat / state

అర్ధరాత్రి వరకు ఆర్థిక సాయం పంపిణీ - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్‌లో వరద ప్రభావానికి గురైన బాధితులకు ప్రభుత్వం పదివేల రూపాయల నగదు సాయం కొనసాగుతోంది. దసరా పండగ వరకు సాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు నగదు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 70 వేల కుటుంబాలకు సాయం అందగా... దసరా తర్వాత మిగిలిన కుటుంబాలకు నగదు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సాయం అందించారు.

అర్ధరాత్రి వరకు ఆర్థిక సాయం పంపిణీ
అర్ధరాత్రి వరకు ఆర్థిక సాయం పంపిణీ
author img

By

Published : Oct 25, 2020, 7:20 AM IST

అర్ధరాత్రి వరకు ఆర్థిక సాయం పంపిణీ

హైదరాబాద్ నగరంలో వరద బాధిత కుటుంబాలకు పదివేల ఆర్థిక సాయం పంపిణీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. దసరా నాటికి సాయం అందించాలన్న సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు నగదు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 780 అధికారుల బృందాల ద్వారా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లక్షా 13వేల కుటుంబాలకు సాయం కింద రూ. 113 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. శనివారం రాత్రి 9 గంటల వరకు 70వేల కుటుంబాలకు నగదు సాయం పంపిణీ పూర్తైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అర్ధరాత్రి వరకు కూడా నగదు పంపిణీ కొనసాగింది. దసరా సెలవుల అనంతరం బాధిత కుటుంబాలకు నగదు పంపిణీ మళ్లీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తక్కువ వ్యవధిలో నగదు సాయాన్ని పంపిణీ చేసేందుకు కష్టపడిన అధికారులు, సిబ్బందికి సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

రంగారెడ్డి జిల్లా బాలపూర్‌ రాయల్ కాలనీలో వరద బాధితులకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రభుత్వ సాయం అందించారు. స్థానికంగా బాధితుల ఇంటికి వెళ్లి రూ. 10 వేల నగదు అందజేశారు. జల్‌పల్లి మున్సిపల్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తుర్కయంజాల్‌లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వరద సాయం పంపిణీ చేశారు. వర్షాలకు నీటమునిగిన ప్రతి ఒక్క కుటుంబానికి సాయం అందుతుందని హామీ ఇచ్చారు.

తమ వంతు సాయంగా...

ముంపునకు గురైన 3 వేల కుటుంబాలకు జమాతే ఇస్లామీహింద్‌ తెలంగాణ తరఫున సాయం చేయనున్నట్లు మౌలానా హామిద్‌ ముహమ్మద్‌ ఖాన్‌ వెల్లడించారు. వరద ప్రభావం మొదలైనప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారి పరిస్థితి చూసి చలించిన సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి... సదాశివపేట మండలం చందాపూర్‌లో పలువురు కౌలు రైతులకు సాయం అందించారు. దసరా సందర్భంగా సరుకులు, వస్తువులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: కబ్జాకోరల్లో జల్​పల్లి చెరువు.. 'వరద' విషాదానికి కారణం అదేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.