ETV Bharat / state

ఆ సర్కారు బడి ముందు "కార్పొరేట్​" దిగదుడుపేనట! - సర్కారులో డిజిటల్​ బడి

తల్లిదండ్రులు పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం నాణ్యమైన విద్య అందించాలనుకుంటారు. సామన్యులకు అది తలకు మించిన భారమే అయినా.... ఆ కలను ప్రభుత్వ పాఠశాలలు తీరుస్తున్నాయి. ప్రైవేటుకు ధీటుగా విద్యను అందిస్తున్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లి సర్కారు బడి ఉపాధ్యాయులు డిజిటల్‌ పాఠాలు బోధిస్తూ... చదువు పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచుతున్నారు.

government-digital-school-in-hyderabad
ఆ సర్కారు బడి ముందు "కార్పొరేట్​" దిగదుడుపేనట!
author img

By

Published : Jan 7, 2020, 6:05 AM IST

ఆ సర్కారు బడి ముందు "కార్పొరేట్​" దిగదుడుపేనట!

విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.... వారికి అర్థమయ్యేలా బోధించడం కూడా ముఖ్యమే. తరగతుల పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఈ బడిలో మొత్తం 960 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాల పట్ల ఆసక్తి కలిగించేలా... దృశ్యాల రూపంలో చెబుతున్నారు. డిజిటల్‌ విధానంలో తరగతులు చెబుతున్నారు. హోప్ స్వచ్ఛంద సంస్థ ఈ బడికి ప్రొజెక్టర్లు, డిజిటల్‌ సామగ్రి అందించింది.

దృశ్యరూప బోధన...

క్వేస్ట్-సెయింట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ-లెర్నింగ్ గదిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందించిన పోర్టబుల్‌ కిట్‌తో... డిజిటల్‌ పాఠాలు బోధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలను... విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో బోధిస్తున్నారు. ఒకసారి చెప్పిన పాఠాలను మరోసారి డిజిటల్‌ ద్వారా దృశ్యరూపంలో వివరిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

డిజిటల్​తో సులభరీతిలో..

సామాన్య శాస్త్రంలోని పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల డిజిటల్‌ తరగతుల ద్వారా సులభంగా అర్థం చేసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. గణితం చాలా ఇబ్బందిగా ఉండేదని.... డిజిటల్‌లో త్రిభుజాలు, పట్టికల ద్వారా సులభరీతిలో అర్థమవుతున్నాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

హాజరుశాతం పెరుగుతోంది...

గతంలో ఈ పాఠశాలలో విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. ప్రస్తుతం డిజిటల్‌ బోధన వల్ల పాఠశాలలో హాజరుశాతం పెరిగింది. పాఠాలు వినడంతోపాటు దృశ్యరూపంలో చూడడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

డిజిటల్‌ తరగతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరింత నాణ్యమైన బోధన అందించవచ్చని.... విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.